NTV Telugu Site icon

Health Tip: డెంగ్యూ బారిన పడి రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందా? ఇలా పెంచుకోండి

Dengue Fever

Dengue Fever

Food To Improve Resistance Power After Dengue:  వ‌ర్షాకాలంలో వానల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో దోమల దండయాత్ర మొదలవుతుంది. వాతావరణం తేమగా ఉండటంతో దోమల దండు రెచ్చిపోతూ ఉంటుంది.  దోమ‌ల వ్యాప్తితో ప‌లు ఇన్ఫెక్ష‌న్లు, వ్యాధులు వస్తాయి.  డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ముప్పు వర్షాకాలంలో అధికంగా ఉంటుంది.  డెంగ్యూ వ్యాధి బారిన పడితే చాలా కష్టమనే చెప్పాలి. సరైన సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే  బ్లడ్ ప్లేట్ లెట్ లు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు నిర్లక్ష్యం చేస్తే ఇంట్ననల్ బ్లీడింగ్ జరిగింది మరణించవచ్చు కూడా. ఇక డెంగ్యూ వస్తే వ్యాధినిరోధక శక్తి పూర్తిగా దెబ్బ తింటుంది. అయితే కొన్ని రకాల వాటిని తినడం వల్ల మనం పూర్తిగా కోలుకోవచ్చు .

Also Read: Yadadri: యాదాద్రి కొండపై మరో అద్భుతం.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూ. 7.70 కోట్లతో డిజైన్

డెంగ్యూ నుంచి కోలుకోవడానికి జామ పండు నిజ‌మైన సూప‌ర్‌స్టార్‌గా పని చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవడానికి విటమిన్ సీ చాలా అవసరం. ఇది జామలో పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా జామలో ఉండే స‌హ‌జ‌మైన యాంటీ  ఇన్ ఫ్లేమేటరీ గుణం కలిగిన క్వెరసిటిన్ జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఇక బొప్పాయి ఆకులను డెంగ్యూకు సహజమైన ఔషధంగా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఆకుల్లో ప‌పైన్, చిమోప‌పైన్ వంటి ఎంజైమ్‌లు అధికంగా ఉండ‌టంతో ఇవి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచ‌డంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇక ఆకుకూర‌లు, కాయ‌గూర‌ల్లో విట‌మిన్ ఏ, విట‌మిన్ సీ, విట‌మిన్ కే, ఫోలేట్ వంటి విట‌మిన్లు, మిన‌రల్స్  అధికంగా ఉండటంతో పాటు వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. బ్రకోలి, పాలకూర మంటి ఆకుకూరలను తరచూ మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిది.