Site icon NTV Telugu

Food To Avoid With Tea: టీతో పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!

Tea

Tea

Food To Avoid Eating with Tea: భారతదేశంలో ‘టీ’ని తాగేవారు చాలా చాలా ఎక్కువ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా టీని తాగేస్తుంటారు. వేడి వేడి టీ ఉదయాన్నే తాగితే కానీకే కొందరికి రోజు మొదలు కాదు. దేశంలో చాలా మంది టీకి బానిసైపోయారు. టీతో తాజాదనం, మెదడుకు శక్తి, శరీరానికి ఉత్తేజం కలుగుతాయని అందరూ తాగుతూ ఉంటారు. ఇది నిజమే అయినా.. కొన్ని పదార్థాలను టీతో కలిపి తీసుకుంటే మాత్రం మనం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. టీతో ఏ పదార్థాలు తినకూడదో (Foods You Should Avoid Consuming with Tea) ఇప్పుడు చూద్దాం.

బిస్కెట్స్, బన్:
టీతో పాటు బిస్కెట్స్, బన్, రస్కులు వంటి మైదా ఆధారిత పదార్థాలు అస్సలు తినకూడదు. అవి అనారోగ్య ఇబ్బందులకు కారకాలు. యువతలో గుండెపోటు సమస్య పెరగడానికి టీ, బిస్కెట్లు తినడం ఓ కారణం. బిస్కెట్స్‌లో అధికంగా ఉండే సోడియం వల్ల ఇది రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్:
మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ తినొచ్చు. వాల్‌నట్‌లు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరం మరియు ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీకు శక్తి లభిస్తుంది. అయితే టీతో పాటు నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ తీసుకోవద్దు.

Also Read: Rohit-Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ కోసమే ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్‌ చేశా: రోహిత్ శర్మ

పండ్లు:
పలు రకాల పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. మీరు అన్నం, రోటీ లేదా అల్పాహారంతో పండ్లను తినవచ్చు. మీకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్‌లను అవి అందిస్తుంది. దాంతో జీర్ణవ్యవస్థన మెరుగుపడుతుంది. అయితే పండ్లను టీతో ఎప్పుడూ తినకూడదు.

యోగర్ట్ మరియు ఫ్రూట్:
పెరుగు మరియు తాజా పండ్ల ప్లేట్ అద్భుతమైన ఎంపిక. పెరుగు మీకు ప్రోటీన్, కాల్షియం మరియు ప్రోబయోటిక్స్‌ను అందిస్తుంది. ఇవి మీ జీర్ణవ్యవస్థకు చాలా మంచివి కూడా. అరటి, యాపిల్, ద్రాక్ష మొదలైన పండ్లను యోగర్ట్ లో వాడొచ్చు. అయితే మీరు టీతో పెరుగు తినకూడదు. అలా తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. టీతో వేయించిన పప్పులను తీసుకోవడం చాలా మంచిది.

Also Read: Ashwin-Harbhajan: హర్భజన్‌ సింగ్‌ రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. ఇక అనిల్ కుంబ్లే టార్గెట్!

Exit mobile version