NTV Telugu Site icon

Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు

Nizamabad Kasturba School

Nizamabad Kasturba School

Food Poisoning: నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడం వల్ల రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపు 80 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు గురయ్యారు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే వారు విద్యార్థినులను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన వారు భీంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా పిల్లల అరుపులతో నిండిపోయింది. గత రాత్రి భోజనం చేసిన విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో కలుషిత ఆహారమే కారణమని అధికారులు తేల్చారు. విద్యార్థులు తిన్న ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు.

చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం అందిస్తున్న హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని కనీసం పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందించడం లేదని వాపోయారు. హాస్టల్‌లో భోజనం, ఇతర సౌకర్యాలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ పిల్లలకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. పిల్లలు అస్వస్థతకు గురయ్యారని యాజమాన్యం సమాచారం అందించలేదని మండిపడ్డారు. తోటి విద్యార్థులు చెప్పడంతోనే మాకు తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తగిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిజామాబాద్‌ ఆస్పత్రికి హుటా హుటిన చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్‌ ఆస్పత్రికి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి సీరియస్..

నిజామాబాద్ భీంగల్ కస్తూరిబా స్కూల్ లో ఫుడ్ పాయిజన్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం వైద్యసేవలపై ఆరా తీసారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని కోరారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

Read also: PVR Inox Share : జవాన్ తుపాను 217 నిమిషాల్లో రూ.309 కోట్ల నష్టం

మహబూబాబాద్ జిల్లా కస్తూర్భా పాఠశాలలో మార్చి 9వ తేదీన 16 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో.. అస్వస్థతకు గురైన అమ్మాయిలను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేదుకు.. డాక్టర్లనే కస్తూర్భా పాఠశాలకు తీసుకొచ్చి.. లోపలే సీక్రెట్‌గా వైద్యం అందించే ప్రయత్నం చేశారు. మొత్తానికి సమాచారం బయటకు రావడంతో.. హుటాహుటిన రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి విద్యార్థులను తరలించి చికిత్స అందిస్తున్నారు.
RSS: ఆర్ఎస్ఎస్‌కి కేరళ హైకోర్ట్ షాక్.. ఆలయంలో ఆయుధ శిక్షణపై నిషేధం..