Gannavaram Airport: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం వాతావరణంలో వ్యాపించిన దట్టమైన పొగ మంచు కారణంగా అర గంటకు పైనే గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అయితే, సేఫ్ ల్యాండింగ్ కి వాతావరణం అనుకూలించక పోవడంతో మళ్లీ ఇండిగో విమానం తిరిగి హైదరాబాద్ కు వెళ్ళింది. అలాగే, చెన్నై నుంచి వచ్చిన మరో ఇండిగో విమానంతో పాటు ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం సైతం గాల్లో కాసేపు తిరిగడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, సదరు విమాన సర్వీసులను దారి మళ్లీంచినట్టు పేర్కొన్నారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
అయితే, గన్నవరంలోని ఎయిర్ పోర్టు వద్ద దట్టమైన పొగమంచు ప్రభావంతో.. పలు విమానాల ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వాటిని సేఫ్ గా ల్యాండింగ్ కోసం హైదరాబాద్ కు దారి మళ్లీంచినట్లు విమానాయన సంస్థ పేర్కొనింది. ఇక, గన్నవరం విమానాశ్రయంలో భారీగా పొగమంచు కురవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.