Site icon NTV Telugu

Florida Student: టీచర్‎ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్

Student

Student

Florida Student: చదువును ప్రసాదించే గురువులను దేవతలుగా పూజించాలి. కానీ, ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం తన వీడియో గేమ్ తీసేసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో అసిస్టెంట్ టీచర్(టీచర్స్ ఎయిడ్)పై రెచ్చిపోయి దాడి చేశాడు. ఫ్లోరిడాలోని మటాంజస్ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లాగ్లర్ కౌటీ షెరిఫ్ కార్యాలయం ఈ దాడికి సంబంధించి వీడియో ఫుటేజీని విడుదల చేసింది.

Read Also: China People: ‘సోలో బతుకే సో బెటర్’ అంటున్న చైనీయులు

స్కూల్లో వీడియో గేమ్ ఆడుతుండడంతో అసిస్టెంట్ టీచర్ దాన్ని తీసుకుని తరగతి నుంచి వెళ్తున్నారు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన 17 ఏళ్ల విద్యార్థి, టీచర్ ను గట్టిగా తోసేశాడు. ఆమె ఎగిరి దూరంలో కిందపడిపోయింది. తల నేలను గట్టిగా తాకడంతో స్పృహ కోల్పోయింది. అయినా కానీ విద్యార్థి ఆగలేదు. ఆమె వీపు భాగంలో పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అక్కడ ఉన్న వారు అతడ్ని ఏదో విధంగా కొంత సమయానికి నిలువరించారు.

Read Also:Nellore crime: నెల్లూరులో దారుణం…యువకుడిపై కత్తులతో దాడి

‘‘ఇది హత్య లాంటిదే. ఎవరినైనా అలా కిందకు తోసినప్పుడు, వారి తల నేలను తాకినప్పుడు ఫలితాన్ని ఊహించలేం’’ అని సెరిఫ్ రిక్ స్టాలీ ప్రకటించారు. అసిస్టెంట్ టీచర్ ను హాస్పిటల్ లో చేర్పించగా, తీవ్రంగా గాయాలపాలై.. పక్కటెముకలు విరిగినట్టు గుర్తించి వైద్యం అందించారు.

Exit mobile version