Donald Trump: సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ కోర్టు మామూలు షాక్ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడిపై యూఎస్‌లో పనిచేస్తున్న విదేశీయులను అనేక అవస్థలకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన కొన్నిసార్లు వలసదారులను బహిష్కరించడం ద్వారా, మరికొన్నిసార్లు వీసా నియమాలను కఠినతరం చేయడం ద్వారా, అమెరికాలో స్థిరపడాలనే ప్రజల కలలను చెదరగొట్టారని విమర్శలు మూటగట్టుకున్నారు. తాజాగా ట్రంప్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను కొట్టివేస్తున్నట్లు ఫ్లోరిడా కోర్టు సంచలన ప్రకటన విడుదల చేసింది.
READ ALSO: India vs Pakistan: ఎందుకంత భయం..? భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కొత్త వ్యూహం..
$15 బిలియన్ల పరువు నష్టం దావా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌పై దాఖలు చేసిన $15 బిలియన్ల పరువు నష్టం దావాను ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. యూఎస్‌లో ప్రముఖ వార్తాపత్రికగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ టైమ్స్, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ వార్తాపత్రికపై ట్రంప్ దాఖలు చేసిన దావాను కోర్టు కొట్టివేయడంతో డోనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఆర్థిక పరిస్థితి, ఆయన అమెరికా అధ్యక్షుడు కాకముందు “ది అప్రెంటిస్” అనే టెలివిజన్ కార్యక్రమంలో ఆయన పాత్రపై న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు దృష్టి సారించారు. రస్ బ్యూట్నర్, సుసాన్ క్రెయిగ్ రాసిన ఒక పుస్తకం కథనాన్ని ఈ వ్యాజ్యంలో ట్రంప్ ఉదహరించారు. టెలివిజన్ నిర్మాత మార్క్ బర్నెట్ తనను సెలబ్రిటీగా చేశాడని రచయితలు దురుద్దేశంతో ఆధారాలు లేని వాదనలను సమర్పించారని ట్రంప్ తన దావాలో ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా, సక్సెస్ పుల్ వ్యాపార విజేతగా అప్పటికే విశేష ప్రచారాన్ని సొంతం చేసుకున్నట్లు నిందితులకు పుస్తకం ప్రచురణ సమయంలో తెలుసని పేర్కొన్నారు.
ఈ దావా వేయడానికి ముందు సెప్టెంబర్ 16న ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. “నేను ది న్యూయార్క్ టైమ్స్‌పై $15 బిలియన్ల పరువు నష్టం దావా వేసాను. ఈ పత్రిక దేశ చరిత్రలో అత్యంత నీచమైన, అవినీతి వార్తాపత్రికలలో ఒకటి. ఇది రాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్ పార్టీకి ప్రతినిధిగా మారింది” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పత్రిక తనపై, తన కుటుంబంపై, తన వ్యాపారాలపై, అమెరికా ఫస్ట్ మూవ్‌మెంట్‌పై అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఆయన ఫ్లోరిడాలో దావా వేస్తామని అప్పట్లోనే పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ దావాను కోర్టు కొట్టివేయడంతో ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Cyberattack: యూరోపియన్ దేశాలపై సైబర్ దాడి.. చిక్కుల్లో వేలాది మంది ప్రయాణికులు
