గత కొన్ని రోజులుగా అస్సాం రాష్ట్రంలో వర్షబీభత్సం సృష్టిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జిల్లాల్లో సుమారు 31 వేల మందికి పైత వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) ఇప్పటికే పది జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న అయిదు రోజుల్లో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Also: Girl Molested: కృష్ణా జిల్లాలో దారుణం.. బాలికకు మద్యం తాగించి, లాడ్జికి తీసుకెళ్లి..
లఖింపూర్ జిల్లాలో సుమారు 22 వేల మంది వరద నీటిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. దిబ్రుఘర్, కోక్రాజార్ జిల్లాల్లోనూ వేలాది మంది వరద నీటి ప్రభావానికి గురయ్యారు. ఇక ఏడుజిల్లాల్లో దాదాపు 25 రిలీఫ్ డిస్ట్రిబూషన్ సెంటర్లను అస్సాం సర్కార్ ఏర్పాటు చేసి వాటిని నడిపిస్తోంది. కొన్ని ప్రదేశాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దిమా హసావో, కామరూప్ మెట్రోపాలిటిన్, కరీంగంజ్ వంటి ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
సోనిత్‌పూర్, నగావ్, నాల్బరి, బాక్సా, చిరాంగ్, దర్రాంగ్, దేమాజి, గోల్‌పారా, గోలాఘాట్, కామరూప్, కోక్రాజార్, లఖింపూర్, దిబ్రూగర్, కరీంగంజ్, ఉదల్‌గిరి పట్టణాల్లో ఇప్పటికే రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం హిమంత బిస్వా శర్మ అధికారుల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రజలకు తాము అండగా ఉంటామని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
