Site icon NTV Telugu

Delhi Floods: తాజ్ మహల్ దగ్గరకు వరద నీరు..! 1978 తర్వాత అలాంటి దృశ్యం

Tajmahal

Tajmahal

ఢిల్లీలో వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరదల బీభత్సం కొనసాగుతుంది. వరదల్లో ఆగ్రా జిల్లా అతలాకుతలం అవుతుంది. మరోవైపు గోకుల్ బ్యారేజీ నుంచి గంటకు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఢిల్లీ తర్వాత ఆగ్రాలోనూ యమునా తన భీకర రూపం దాల్చుతుంది. మరోవైపు యమునా నది నీటిమట్టంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే యమునా నీటి మట్టం అనేక ప్రాంతాలను తాకింది. యమునా నది నీరు కూడా తాజ్ మహల్ కాంప్లెక్స్ సరిహద్దు దగ్గరకు చేరుకుంది. యమునా నీటి మట్టం మధ్య స్థాయి 499కి చేరుకుంది. ఆగ్రాలోని పలు ప్రాంతాలకు యమునా నీరు వేగంగా చేరడానికి ఇదే కారణం. యమునా నది నీటిమట్టం పెరగడంతో మెహతాబ్ బాగ్‌లోని తాజ్ వ్యూ పాయింట్‌ను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

Girlfriend Killed: యూపీలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు

మరోవైపు ఆగ్రాలో చాలా ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా ఆగ్రాలో హెచ్చరికలు జారీ చేశారు. 1978 తర్వాత తొలిసారిగా ఆగ్రాలో అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. 1978 తర్వాత మళ్లీ అలాంటి వరదల దృశ్యాన్ని చూశామని ప్రాంతీయ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ రోడ్లపైనే నీరు చేరింది. అంతేకాకుండా యమునా నది ఒడ్డున ఉన్న అనేక చారిత్రక కట్టడాలు మునిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిల్లో.. తాజ్‌నగరి పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇప్పటికే యమునా నది చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడగా.. భారీ నష్టం చేకూరింది. మరోవైపు యమునా నీటిమట్టం పెరగుతుండటంతో.. నది ఒడ్డున నివసించే వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు

Exit mobile version