Moranchapalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేయాలని, పోలీస్ జులుమ్ నశించలంటూ నినాదాలు చేశారు. రాస్తారోకో వల్ల సుమారు పది కిలోమీటర్ల మేర గంట సమయం వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కల్పించుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.
Also Read: Medak Crime: వీడిన మిస్టరీ.. భర్తను, తన చెల్లిని హత్య చేసేందుకు సుపారి ఇచ్చిన అక్క
ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని, ఇప్పటి వరకు మహాలక్ష్మి అనే మహిళ మృతదేహం లభించలేదని, వరద బాధితులకు పదివేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. వరద విపత్తును ముందుగా గమనించని జిల్లా కలెక్టర్ ను వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు లక్ష రూపాయల సహాయం అందించాలని, లేనియెడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.