NTV Telugu Site icon

Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై 75 వేల డిస్కౌంట్! బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కాకుండానే

Tcl P635 65 Inch

Tcl P635 65 Inch

Rs 75 Thousand Discount onTCL P635 65 inch Smart TV in Flipkart: కొత్తగా స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. అందులోనూ థియేటర్ ఫీలింగ్ ఇచ్చే భారీ స్క్రీన్ ఉన్న స్మార్ట్‌టీవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా?. మీ లాంటి వారికోసమే ఓ మెగా ఆఫర్ అందుబాటులో ఉంది. 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై ఏకంగా రూ. 75 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మరి ఇంత డిస్కౌంట్ అంటే.. ఏ బ్యాంక్ ఆఫరో లేదా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫరో ఉందనుకుంటే మీరు పొరబడినట్టే. ఎలాంటి బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ లేకుండానే ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మీరు 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీని ఇంటికితీసుకెళ్లిపోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీ (TCL P635 65 inch Ultra HD 4K LED Smart Google TV)పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ గూగుల్ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 1,24,990గా ఉంది. అయితే మీరు ఈ టీవీని రూ. 49,990కే కైవసం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌టీవీపై 60 శాతం డిస్కౌంట్ ఉంది. దాంతో సగానికిపైగా ధర తగ్గుతుంది. అదే సమయంలో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే.. రూ. 1000 అదనపు తగ్గింపు వస్తుంది. అప్పుడు మీరు టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీని రూ. 48,990కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ. 16,900 వరకు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్ ఉంది. ఈ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ద్వారా మీరు ఈ స్మార్ట్‌టీవీని మరింత తక్కువ ధరకు కొనొచ్చు. ఈ టీవీలో బెజిల్ లెస్ డిస్‌ప్లే, డాల్బే ఆడియో, ఓకే గూగుల్, హెచ్‌డీఆర్ 10 వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు చాలా యాప్స్ ఇందులో చూడొచ్చు. టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీ థియేటర్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే కొనేసుకుంటే బెటర్.

Also Read: SBI WhatsApp Service: ఎస్‌బీఐ వాట్సాప్‌ సర్వీసులు.. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా 15కు పైగా సేవలు!

Also Read: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. 10 సెకన్లకు 30 లక్షలు!

 

Show comments