Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రిపబ్లిక్ డే సేల్ 2026’ ఇప్పుడు అందరు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. జనవరి 17 (ఈ రోజు) నుంచి ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై ఊహించని డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా 50 ఇంచుల (50-inch) స్మార్ట్ టీవీని తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్టోరీలో మీ ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని అందించే 50 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
READ ALSO: US: భారత్ పెట్టుబడుల్ని తెస్తోంది, పాకిస్తాన్ ఏం తెస్తోంది..?
ఈ ఫ్లిప్‌కార్ట్ ‘రిపబ్లిక్ డే సేల్’ లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి అదనపు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ 50-ఇంచ్ టీవీ డీల్స్‌ను చూద్దాం.
1. ఫిలిప్స్ (Philips) 50 అంగుళాల టీవీ: తక్కువ బడ్జెట్‌లో మంచి బ్రాండ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని అసలు ధర రూ. 32,999 కాగా, సేల్‌లో కేవలం రూ.23,999 కే లభిస్తోంది. HDFC కార్డు వాడితే మరో రూ.1,250 తగ్గింపు వస్తుంది. ఇందులో 4K, డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
2. మోటరోలా (Motorola) 50 అంగుళాల టీవీ: ఈ సేల్‌లో అత్యధికంగా 58% తగ్గింపు పొందుతున్న టీవీ ఇదే. రూ. 69,099 విలువైన ఈ మినీ LED టీవీని ఇప్పుడు రూ.28,999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ ద్వారా మరో రూ.1,500 ఈ టీవీపై అదనంగా ఆదా చేయవచ్చు.
3. హైయర్ (Haier) H5E: ఈ QLED అల్ట్రా HD 4K టీవీపై 44% డిస్కౌంట్ ఉంది. లాంచ్ ధర రూ. 55,990 కాగా, ఇప్పుడు సేల్‌లో రూ. 30,990 కే అందుబాటులో ఉంది. దీనిపై రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
4. లూమియో విజన్ 7 (Lumio Vision 7): ప్రస్తుతం మార్కెట్లో క్రేజ్ సంపాదిస్తున్న ఈ బ్రాండ్ టీవీ రూ.58,999 నుంచి రూ.32,499 కి తగ్గింది. ఇది గూగుల్ టీవీ సపోర్ట్, డాల్బీ అట్మోస్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో వస్తుంది. కార్డుపై రూ.2,000 అదనపు డిస్కౌంట్ ఉంటుంది.
5. హిస్సెన్స్ (Hisense) 50E75Q: శక్తివంతమైన 48W స్పీకర్లు కలిగిన ఈ QLED టీవీని రూ. 29,999 కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది.
మీరు పాత టీవీని మార్చి కొత్త స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే, ఈ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సరైన సమయం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్టాక్ ముగియకముందే మీ ఫేవరెట్ టీవీని ఆర్డర్ చేసుకోండి మరి.
READ ALSO: Ravi Teja: వెటకారంతో కూడిన ఫ్రెండ్‌షిప్ మాది: హీరో రవితేజ
