Site icon NTV Telugu

Flipkart GOAT Sale: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ప్రారంభం.. iPad, టాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. లిస్ట్ ఇదిగో..!

Flipkart Goat Sale

Flipkart Goat Sale

Flipkart GOAT Sale: ఫ్లిప్‌ కార్ట్ భారీ డిస్కౌంట్లతో గోట్ సేల్ (జూలై 11–17)ను ప్రారంభించింది. ఈ సేల్‌ లో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా.. టాబ్లెట్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, మేరె ఇతర అవసరాలకైనా స్మార్ట్‌ఫోన్‌ కు ప్రత్యామ్నాయంగా మంచి డివైస్‌ ను కోరుకునేవారు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. మరి ఏ టాబ్లెట్లపై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దామా..

iPad A16 (Wi-Fi + 5G):
ఈ ఐపాడ్ 16.. 11-ఇంచుల లిక్విడ్ రేటినా డిస్ప్లే, A16 బయోనిక్ చిప్‌తో విడుదలైంది. ఈ iPad, iPhone 15 Pro తరహా పనితీరును అందిస్తుంది. ప్రొఫెషనల్స్‌, స్టూడెంట్స్‌, క్రియేటివ్ యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. దీని అసలు ధర రూ. 34,900 కాగా ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 29,999 లభిస్తుంది. అంటే రూ. 4900 డిస్కౌంట్ లభిస్తుంది.

Read Also:GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో బదిలీలు.. 23 మంది డిప్యూటీ కమిషనర్ల పోస్టింగ్ మార్పు..!

రియల్‌మీ ప్యాడ్ 2 లైట్ (4G):
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ టాబ్లెట్.. Helio G99 ప్రాసెసర్‌, 11-ఇంచుల డిస్‌ప్లే, 4G కనెక్టివిటీ కలిగి ఉంది. దీని అసలు ధర రూ.20,999 కాగా ఆఫర్ లో భాగంగా కేవలం రూ.9,749కే లభిస్తుంది. ఈ ధర వద్ద ఇది బెస్ట్ ఛాయస్. మొత్తంగా ఈ టాబ్లెట్ పై ఏకంగా రూ.11250 ల భారీ డిస్కౌంట్ లభించనుంది.

రెడ్‌మీ ప్యాడ్ SE (Wi-Fi):
8GB RAM, 128GB స్టోరేజ్, Snapdragon 680 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ రెడ్‌మీ ప్యాడ్ SE టాబ్లెట్ మంచి యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని ఇస్తుంది. FHD డిస్ప్లేతో మల్టీటాస్కింగ్, మీడియా వినియోగానికి ఇది సరైన ఎంపిక అవుతుంది. దీని అసలు ధర రూ. 19,999 కాగా ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 10,499 లభిస్తుంది. ఈ సేల్ లో టాబ్లెట్ పై రూ. 9500 డిస్కౌంట్ లభిస్తుంది.

వన్ ప్లస్ ప్యాడ్ Go (Wi-Fi + 4G):
విద్యార్థులు, చదువు, పని చేసుకొనే యూజర్లకు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపికగా నిలుస్తుంది. ఈ వన్ ప్లస్ ప్యాడ్ Go (Wi-Fi + 4G) టాబ్లెట్ లో 2.4K డిస్‌ప్లే, అల్యూమినియం డిజైన్‌, Helio G99 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ టాబ్లెట్ OxygenOS అనుభవాన్ని ఇస్తుంది. దీని అసలు ధర రూ. 19,999 కాగా ఆఫర్ లో భాగంగా కేవలం రూ.13,999 లకే లభిస్తుంది. అంటే రూ. 6000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

Read Also:Coolie : ‘కూలీ’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ లాక్..!

రియల్‌మీ ప్యాడ్ 2 LTE:
ఈ రియల్‌మీ ప్యాడ్ 2 LTE టాబ్లెట్, డాక్యుమెంట్ వర్క్, మీడియా వాచ్‌, లైట్ గేమింగ్‌కు అనువుగా ఉంటుంది. ఇందులో 11.5-ఇంచుల 120Hz డిస్‌ప్లే, 8GB RAM, 256GB స్టోరేజ్, Helio G99 ప్రాసెసర్‌ వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 28,999 కాగా ఆఫర్ లో భాగంగా కేవలం రూ.12,499 లకే లభిస్తుంది. అంటే రూ.16500 భారీ డిస్కౌంట్ ఆఫర్ లో లభిస్తుంది.

MOTO Pad 60 Pro (Wi-Fi):
ఈ ప్రీమియం టాబ్లెట్, సృష్టిపరమైన పనులకు, ప్రొడక్టివిటీ టాస్కులకు ఉత్తమ ఎంపిక. ఈ టాబ్లెట్ 12.7-ఇంచుల 3K డిస్‌ప్లే, Dimensity 8300 ప్రాసెసర్, 12GB RAM తో ఉంది.. స్టైలిస్ లుక్, కీబోర్డ్ లాంటి యాడ్-ఆన్ లతో లాప్‌టాప్ అనుభూతిని ఇస్తుంది. దీని అసలు ధర రూ.43,999 కాగా.. ఆఫర్ లో భాగంగా కేవలం రూ.22,499 లకే లభిస్తుంది. అంటే రూ.21500 భారీ డిస్కౌంట్ ఆఫర్ లో లభిస్తుంది.

POCO Pad 5G:
ఈ టాబ్లెట్, గేమింగ్, స్ట్రీమింగ్‌కు సరైన ఎంపికగా నిలుస్తుంది. ఈ టాబ్లెట్ లో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్, 5G కనెక్టివిటీ, 12.1-ఇంచుల డిస్ప్లే, క్వాడ్ స్పీకర్ సెటప్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.30,999 కాగా.. ఆఫర్ లో భాగంగా కేవలం రూ.18,499లకే లభిస్తుంది. అంటే రూ.9499 భారీ డిస్కౌంట్ ఆఫర్ లో లభిస్తుంది.

Exit mobile version