NTV Telugu Site icon

Flipkart: వందల మంది ఉద్యోగులపై ఫ్లిప్ కార్ట్ వేటు.. అదే అసలు కారణమా?

Flipkart (4)

Flipkart (4)

ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..

వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా నియామకాలను ఫ్లిప్‌కార్ట్ నిలిపివేసింది. గత రెండేండ్లుగా కంపెనీ సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగులపై వేటు వేయడంతో పాటు ఏటా పలువురు ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 22,000 మంది ఉద్యోగులుండగా వారిని వివిధ విభాగాల్లో సమర్ధంగా వినియోగించుకుంటూ 5 నుంచి 7 శాతం సిబ్బందిని తప్పించాలని ఫ్లిప్‌కార్ట్ కసరత్తు సాగిస్తోంది. వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలను సిద్ధం చేసి రోడ్ మ్యాప్ ను ఫిక్స్ చేయనున్నారు..

ఆర్థిక అభివృద్ధిలో క్షీణత కారణంగా కొన్ని ప్రముఖ దిగ్గజ కంపెనీలు అయిన పేటీఎం, అమెజాన్‌, మీషో వంటి పలు కంపెనీలు సైతం ఇటీవల ఇదే తరహా వ్యయ నియంత్రణ చర్యలను చేపడుతున్నాయి. ఇక 2023లో పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఫ్లిప్‌కార్ట్ నిలకడైన వృద్ధి కోసం ప్రతిపాదిత పునర్వ్యవస్ధీకరణపై దృష్టి సారించింది. ఈ-కామర్స్ పరిశ్రమలో దీర్ఘకాలిక వృద్ధిపైన ఆయా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి..