Flipkart Bye-Bye 2025 Sale offers Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్‌లో బై-బై 2025 సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. డిసెంబర్ 5న మొదలైన ఈ సేల్ డిసెంబర్ 10తో ముగుస్తుంది. తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలనుకుంటే Samsung Galaxy S24 FE మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఇప్పుడు దాదాపు ఆఫ్ రేట్‌కే లభిస్తోంది. Samsung Galaxy S24 FE అసలు ధర రూ. 59,999. కానీ ప్రస్తుతం కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 31,999కే అందిస్తోంది. అంతే కాదు.. ప్రస్తుతం ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి.
READ MORE: Health Risks of Plastic Bottles: ప్లాస్టిక్ బాటిళ్లతో తరచూ నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త..!
Samsung Galaxy S24 FE 5Gని ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే మరో రూ. 4,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్ల తర్వాత ఈ ఫోన్‌ను రూ. 30,000 కంటే తక్కువ ధరకి కూడా కొనవచ్చు. ఈ ధరలో 8GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్ లభిస్తుంది. ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్, EMI ఆప్షన్ కూడా ఉంది. Samsung Galaxy S24 FE 5Gలో 6.7 అంగుళాల Dynamic AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గోరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫోన్ Android 14తో వస్తుంది.. అయితే తర్వాత లేటెస్ట్ OS అప్డేట్స్ కూడా అందించింది. ఈ మోడల్‌కు 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ లభిస్తుంది. ఫోన్ Exynos 2400e ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
READ MORE: Palnadu Crime: పల్నాడులో తల్లీకొడుకుల మృతి కలకలం.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..?