Site icon NTV Telugu

Flipkart Offers 2024: ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు!

Flipkart Big Saving Days Sale

Flipkart Big Saving Days Sale

Offers on Redmi Note 13 Pro in Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ సేల్‌ 2024 కొనసాగుతోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్.. మే 9 వరకు కొసనసాగనుంది. ఈ సేల్‌లో ల్యాప్‌ట్యాప్, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ కూడా రానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రూ.27,999కే లభించనుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.36,999గా ఉండగా.. 16 శాతం తగ్గింపు అనంతరం రూ.30,999కి అందుబాటులో ఉంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు లేదా ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. దాదాపుగా రూ.28 వేలకు మీకు లభిస్తుంది. రియల్‌మీ పీ1 ప్రో రూ.19,999, వివో టీ2 ప్రో 5జీ రూ.20,999కే కొనుగోలు చేయొచ్చు.

Also Read: Bhuvneshwar Kumar: చివరి ఓవర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు: భువనేశ్వర్‌ కుమార్

బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో పోకో ఎక్స్‌6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999కి మీకు అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్‌ 13ప్రో 5జీ రూ.21,999కే లభించనుంది. ఇన్ఫినిక్స్‌ నోట్ 40 ప్రో5జీని రూ.19,999కి.. ఒప్పో ఫైండ్ ఎన్‌3 ఫ్లిప్‌ రూ.49,999కి కొనుగోలు చేయొచ్చు. రియల్‌మీ 12 ప్రో రూ.22,999, మోటోరొలా ఎడ్జ్‌ 40 నియో రూ.19,999కి లభిస్తుంది. మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ తగ్గింపు ఉంది.

Exit mobile version