Flipkart Diwali Sale: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ ఈ నెల 5 నుంచి 8 తేదీ వరకు బిగ్ దసరా సేల్ నిర్వహించింది. ఈ సేల్ నిన్ననే ముగిసింది. అయితే వెంటనే బిగ్ దీవాళి సేల్ ప్రకటించి వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఈ సేల్ ను నిర్వహించనున్నారు.
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు, కెమెరాలు, కంప్యూటర్, యాక్ససరీలపై 80 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని వెల్లడించింది. టీవీలు, అప్లియెన్సెస్ పై 75 శాతం డిస్కౌంట్లు ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ తన దివాళి సేల్స్ పేజీలో పేర్కొంది. ముఖ్యంగా 4కే ఆల్ట్రా హెచ్డీ టీవీలు రూ.17,249 నుంచే ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచి ప్రారంభం అవుతాయి. ఏసీలు 55 శాతం డిస్కౌంట్లతో కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫ్యాషన్ ఐటెమ్స్ పై 60నుంచి 80 శాతం డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. ఇంకా బ్యూటీ, ఫుడ్, టాయ్స్ ఐటెమ్స్ రూ.99 నుంచే ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
Read Also: Uttar pradesh : యూపీలో అమానుషం.. 36ఏళ్లుగా కూతురుని గదిలో బంధించిన తండ్రి
హోం అండ్ కిచెన్ ఐటెమ్స్ 80 తగ్గింపులతో లభిస్తాయని తెలిపింది. హెటల్, ఫ్లైట్ బుకింగ్స్ పై అదిరే ఆఫర్లు ఉంటాయని వెల్లడించింది తెలిపింది ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇంకా ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్ పై సైతం భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. కొటక్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, యోనో ఎస్ బీఐ తో షాపింగ్ చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా పేటీఎంతో 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా.. అమెజాన్ సైతం ఆఫర్లు, డిస్కౌంట్లు, సేల్స్ అంటూ హడావుడి చేస్తోంది. మొత్తం మీద.. భారతీయులకు వీటి వల్ల నిజమైన పండుగ సీజన్ నడుస్తోందనే చెప్పుకోవాలి!