Flipkart’s Rs 1 Auto Ride in Bengaluru: ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ 2024ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచే మొదలైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. దాంతో సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అయితే సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరు వాసులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1 కే ఆటో రైడ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
ఆటో రైడ్ స్కీమ్ కోసం స్థానిక ఆటో డ్రైవర్లతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. రూపాయికే ఆటో రైడ్ కావడంతో జనాలు ఎగబడుతున్నారు. రూపాయికే ఆటో బుక్ చేసుకొని.. బెంగళూరు నగరంలో ఎంచక్కా చక్కర్లు కొడుతున్నారు. ఈ స్కీమ్‌కు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. పీక్ అవర్స్‌లో జనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. పలు ముఖ్య ప్రాంతాల్లో ఫ్లిప్‌కార్ట్ స్టాళ్లను ఏర్పాటు చేసింది.
Also Read: Polena Anjana: పవన్ కల్యాణ్ చిన్న కుమార్తెను చూశారా?.. అక్కాచెల్లెళ్ల పిక్స్ వైరల్?
బెంగళూరులో తమ ప్రచారానికి అద్భుత స్పందన లభించిందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం, అలానే క్యాష్‌లెస్ సేవలను ప్రమోట్ చేసేందుకు ఈ స్కీమ్‌ను తీసుకొచ్చామని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. మా నగరంలో కూడా ఆటో రైడ్ స్కీమ్‌ను పెట్టాలని ఫ్లిప్‌కార్ట్‌కు కొందరు అభ్యర్థనలు పంపుతున్నారు.