NTV Telugu Site icon

Human Trafficking : స్వదేశానికి చేరుకున్న విమానం.. 27 మంది భారతీయులు ఎక్కడ ?

New Project 2023 12 26t080451.149

New Project 2023 12 26t080451.149

Human Trafficking : మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న రొమేనియా విమానం భారత్‌కు చేరుకుంది. ఈ విమానంలో 276 మంది ప్రయాణికులు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో విమానం ముంబై చేరుకుంది. ఈ విమానం సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరింది. ఈ విమానం దుబాయ్ నుంచి నికరాగ్వా వెళ్తుండగా అందులో 303 మంది ప్రయాణికులు ఉన్నారు.

అయితే ఈ విమానం భారత్‌కు తిరిగి వచ్చేసరికి అందులో కేవలం 276 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. మరి అందులో ఉన్న మిగతా 27 మంది భారతీయులు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది. మానవ అక్రమ రవాణా అనుమానంతో గురువారం ఈ విమానం పారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో ఆపివేయబడింది. ఈ విమానంలో 21 నెలల చిన్నారితో పాటు 11 మంది మైనర్లు కూడా ఉన్నారు. ఆదివారం విమానం మళ్లీ ప్రయాణించేందుకు ఫ్రాన్స్ అధికారులు అనుమతి ఇచ్చారు.

Read Also:Margasira Purnima: కోరుకున్నది నెరవేరాలంటే ఈ స్తోత్రం వినండి

27 భారతీయులు ఎక్కడ ఉన్నారు?
సోమవారం ఈ విమానం 276 మంది ప్రయాణికులతో భారత్‌కు బయలుదేరింది. మిగిలిన 27 మంది ప్రయాణికుల్లో 25 మంది ఫ్రాన్స్‌లో ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. అదే సమయంలో మరో ఇద్దరు ప్రయాణికులను కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి అక్కడి నుంచి విడుదల చేశారు. సోమవారం ఈ విమానం భారత్‌కు బయలుదేరిన తర్వాత ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఫ్రెంచ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఫ్రాన్స్‌కు భారత్ కృతజ్ఞతలు
ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ప్రయాణికులు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడడానికి అక్కడికక్కడే ఉన్న ఎంబసీ బృందంతో కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలు. భారతదేశంలోని ఏజెన్సీలకు కూడా ధన్యవాదాలు.

Read Also:Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే అదృష్టం పడుతుంది

మానవ అక్రమ రవాణాకు 20 ఏళ్ల జైలు శిక్ష
మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన కస్టడీని శనివారం 48 గంటల పాటు పొడిగించారు. ఇంతలో, విమానయాన సంస్థ స్మగ్లింగ్‌లో ప్రమేయం లేదని ఖండించింది. ఫ్రాన్స్‌లో మానవ అక్రమ రవాణాకు 20 సంవత్సరాల వరకు శిక్ష విధించే నిబంధన ఉంది.