Site icon NTV Telugu

Visakha: పండుగ రద్దీ వేళ పలు విమాన సర్వీసులు రద్దు

Vizag Airport

Vizag Airport

Visakha: విశాఖ విమానాశ్రయంలో పండుగ రద్దీ వేళ పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసులు రద్దు కావడంతో పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ రావలసిన సర్వీసులు రద్దయ్యాయి.

Read Also: PM Modi: 16న లేపాక్షిని సందర్శించనున్న ప్రధాని మోడీ

విశాఖ నుంచి ఢిల్లీ ఇండిగో, ఢిల్లీ ఎయిర్ ఇండియా, విజయవాడ, ముంబాయి, హైదరాబాద్, చెన్నై, ఇండిగో, ఎయిర్ ఇండియా, విమానాలు విశాఖ నుంచి వెళ్లేవి, విశాఖకు వచ్చేవి రద్దయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారి మంచు కురుస్తుండటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇండిగో సంస్థలతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగి ఆందోళన చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version