Site icon NTV Telugu

JanaSena: ఫ్లెక్సీ కలకలం.. జనసేన అభ్యర్థి, నేతలు మా గ్రామంలోకి రావొద్దు..!

Janasena

Janasena

JanaSena: ఎన్నికల తరుణంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థి గానీ, నాయకులు గానీ.. మా గ్రామంలోకి రావొద్దు అని హెచ్చరిస్తూ మాగపువారిపేట గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం మాగపువారిపేటలో ఈ వార్నింగ్‌ ఫ్లెక్సీలు కలకలం రేపుపుతున్నాయి.. మాగపువారిపేట ఎదురుగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. అసలు జనసేన అభ్యర్థి, నేతలు తమ గ్రామంలోకి ఎందుకు అడుగుపెట్టదో కూడా.. ఆ ఫ్లెక్సీలపై రాసుకొచ్చారు స్థానికులు..

Read Also: Sridhar Babu: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తాం..

ఇక, ఆ ఫ్లెక్సీల విషయానికి వెళ్తే.. అయినవిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి రాజేష్ తమ సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. అతడిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదంటున్నారు.. తమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో మా గ్రామాల్లోకి రావొద్దు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. మా కులాన్ని దూషించి మా గ్రామంలోకి ఎలా వస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మా గ్రామంలోకి జనసేన అభ్యర్థి, నాయకులు ఎవరూ రావొద్దు అంటూ ఫ్లెక్సీపై రాసుకొచ్చారు.. కులాన్ని దూషించిన వ్యక్తి పై చర్యలు తీసుకోకపోతే జనసేన నేతలను దళితపేటల్లో తెరగనివ్వమంటూ హెచ్చరిస్తున్నారు దళిత సంఘాల నేతలు.. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నేతలో ప్రచారంపై ఫోకస్‌ పెట్టిన ఈ సమయంలో.. ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు అయినవిల్లి మండలంలో కలకలం రేపుతున్నాయి.

Exit mobile version