NTV Telugu Site icon

Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు

Oldcity Drugs

Oldcity Drugs

మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు. మూడేళ్లుగా సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పట్టుకున్న వివిధ రకాలకు చెందిన దాదాపు ఐదు వేల కిలోల డ్రగ్స్ నీ అధికారులు ధ్వంసం చేశారు. 122 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 30 పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. 2600 లీటర్ల హశిష్ ఆయిల్, పెద్ద ఎత్తున కొకైన్ ని కూడా ధ్వంసం చేశారు. పెద్ద మొత్తంలో గంజాయి చెట్లను కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని బయో మెడికల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి నాశనం చేశారు. బెంగళూరు

READ MORE: Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ

భాగ్యనగరంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్‌ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్‌ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు.. డబ్బుల కోసం భావితరాల యువతను నాశనం చేస్తున్నారు.. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నారు. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు హైదరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు.