హర్యానాలో హింసాకాండ ఆగడం లేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి పెద్ద దుమారం రేగింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా సుమారు 120 వాహనాల్లో మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ హింసను నియంత్రించేందుకు నుహ్ లో 144 సెక్షన్, కర్ఫ్యూ అమలు చేశారు. 70 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నుహ్ హింసపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిచారు. సోమవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల వెనుక “కుట్ర” ఉందని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని, హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు.
Transfer of Tahsildars: తెలంగాణ వ్యాప్తంగా తహశీల్దార్ల బదిలీలు..
మరోవైపు రాష్ట్రంలో హింసాకాండ చెలరేగడంతో.. హర్యానాలోని ఇతర ప్రాంతాల నుండి కూడా అదనపు బలగాలను తరలిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తెలిపారు, “సీనియర్ ఐపిఎస్ అధికారులు వారు మోహరించిన ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు. ఇదిలావుండగా.. నుహ్ జిల్లాలో ఆగస్టు 2 (బుధవారం) వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఘర్షణలు జరిగిన ఒకరోజు తర్వాత జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేశారు.
Canada: కెనడా భారతీయుడికి జైలు శిక్ష.. మానవ అక్రమ రవాణా కేసులో శిక్ష ఖరారు
నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగగా.. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అంతేకాకుండా నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు సమాచారం.
