Site icon NTV Telugu

Nirmal: బాసరలో విషాదం.. పుణ్య క్షేత్రంలో స్నానానికి వెళ్ళి ఐదుగురు మృత్యువాత

Godawari

Godawari

నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి నది స్నానం ఆచరించడానికి వెళ్ళి ఐదుగురు యువకులు నదిలో మునిగి మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు, మిగతా ఇద్దరు వీరి సమీప బంధువులు ఉండటం వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ చింతల్, దిల్సుక్ నగర్ కి చెందిన 18 మంది బాసర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లారు అందులో భాగంగా నది స్నానం ఆచరించడానికి బోట్ లో నది మధ్యలో గల దీవి లాంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ దిగి స్నానం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కాలు జారి అక్కడున్న లోతులో మునిగి మరణించారు.

Also Read:Akhanda -2 : అఖండ-2 కొత్త షెడ్యూల్.. అక్కడే షూట్..

మృతులు రాకేశ్ (20), మధన్ (18), భరత్(16), వినోద్ (19), హ్రితిక్ (22). ముఖ్యంగా భక్తులు అనుమతి ఉన్న స్నాన ఘాట్ లల్లో మాత్రమే స్నానం చేయాలి అంతే తప్ప నది లో ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకూడదు. కావున భక్తులందరూ జరుగుతున్న ప్రమాదాల్ని దృష్టి లో ఉంచుకొని జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు.

Also Read:Union Minister Piyush Goyal: పొగాకు రైతుల పిల్లలకు జపనీస్, జర్మన్, చైనా భాషలను నేర్పుతాం..

బాసర నది ప్రమాదం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐపిఎస్ దీనిపై సమీక్షించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ మల్లేష్ (ముధోల్), ఎస్సై శ్రీనివాసులతో కలిపి ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నదిలో అనుమతి ఉన్న స్నాన ఘాట్ లో మాత్రమే భక్తులు స్నానాలు చేసే లాగా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని ప్రదేశాల్లో, ప్రమాదకరం గా ఉన్న ప్రదేశాల్లో భక్తులు స్నానానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశించారు.

Exit mobile version