ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో రైతులు సుమారు 30 వేల ఎకరాల్లో చేపలు రొయ్యలు సాగు చేస్తున్నారు. రెండు రోజులు బట్టి ఎండ తీవ్రత ఉక్కుపోతవలన చాపల చెరువులో డీవో పడిపోయి ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడుతున్నాయి. డీవో పడిన చేపలను అమ్మటానికి మార్కెట్ కి తీసుకుని వెళ్తే అక్కడ కేజీకి 10 నుంచి 20 రూపాయలు పలకటంతో ఆక్వా రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చేసేదేమీ లేక వాటిని దళారులకు అప్పగించి తిరిగి వస్తున్నారు. చేపలు తీసుకుని వెళ్లిన ఆటో కిరాయి ఖర్చులు కూడా రాకపోవడంతో.. కొందరు రైతులయితే సరుకు వదిలేసి వస్తున్నారు. వాటి మేతకు అయ్యే ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి వచ్చే రాబడి కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ఒక్కసారి మార్కెట్ కు భారీ స్థాయిలో చేపలు రావడంతో కొనేవారు లేక రేటు దారుణంగా పడిపోయిందని వ్యాపారస్థులు చెబుతున్నారు.
READ MORE: Cyclone Remal: రెమల్ తుఫాను బీభత్సం.. బెంగాల్‌లో ఇద్దరు మృతి
కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మార్కెట్లలో చేపల ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో తెల్ల చేపలు రూ.10 నుంచి రూ.30 వరకు మాత్రమే పలుకుతుండడంతో చేపలను తరలించిన వ్యాను కిరాయి ఖర్చులు రావడం లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉక్కబోయడంతో చెరువుల్లో ఆక్సిజన్ లోపించి చేపలు భారీగా మృత్యువాత పడడంతో చేసేదేమీ లేక చేపలను వ్యాన్‌లపై ఆకివీడు మార్కెట్‌కు తరలించి తక్కువ ధరకు అమ్ముతున్నట్టు రైతులు తెలిపారు. అసలే ఆదివారం కావడంతో తక్కువ ధరకే తెల్ల చేపలు లభిస్తుండటంతో ప్రజలు భారీగా కొనుగోళ్లు చేశారు.