Electricity Demand : తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electricity Demand : తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. తాజాగా, తెలంగాణ చరిత్రలోనే విద్యుత్ డిమాండ్ అత్యధికంగా రికార్డుస్థాయిలో మంగళవారం నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకు ఏకంగా 14,750 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతగా విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో ఫిబ్రవరి 11, శనివారం 14,649 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇంతకుముందు వ్యవసాయానికి 35 శాతం మాత్రమే విద్యుత్ వినియోగించేవారని.. కానీ, ఇప్పుడు అది 37 శాతానికి పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.
Read Also: TikTok : టిక్ టాక్‌కు చెక్.. నిషేధం విధించిన కెనడా ప్రభుత్వం
Also Read
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పంటలకు వినియోగించే నీటి స్థాయి పెరిగిందని, ఉద్యాన పంటలకు కూడా నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎక్కువగా బోరుబావులపై ఆధారపడే వ్యవసాయ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం ఇదే రోజు గరిష్ట డిమాండ్ 12996 మెగా వాట్లు మాత్రమే నమోదైంది. ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారుల అంచనా. డిమాండ్ ఎంత వచ్చిన 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!