గణేష్ నవరాత్రోత్సావలు వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా తేడాలేకుండా.. అందరూ సంతోషంగా జరుపుకుంటారు. అయితే.. వివిధ ప్రత్యేక ఆకర్షణలతో ఘననాథుడిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తుంటారు. అయితే.. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వినూత్న రీతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు కొందరు. అయితే.. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ నాగోల్ లో 5000 వేల మొక్కలతో పూజలందుకుంటోంది 20అడుగుల గ్రీన్ గణేష్ విగ్రహం.
Also Read : Ambati Rambabu: ఇక్కడున్నది కాపు బిడ్డ.. బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్
ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా గ్రీన్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నాగోల్ లో 5000 వేల మొక్కలతో గ్రీన్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రీన్ గణేశునికి తొమ్మిది రోజులు పాటు హాట్టహసంగా పూజలు జరుగుతున్నాయి. గ్రీన్ గణేష్ నీ దర్శించుకునే ప్రతి భక్తుడికి ప్రసాదంగా ఒక మొక్క ను నిర్వాహకులు ఇస్తున్నారు. నిమజ్జనం రోజు పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహం లోని మొక్కలను భక్తులకు పంచాలని, ఇండియాలోని అందరూ మొక్కలు పెంచి పచ్చదనంతో ఆరోగ్యమైన గాలి పీల్చుకుని ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా ఆ గణేశుని ఆశీస్సులు మన అందరిపైనా ఉండాలి అని కోరుకుంటున్నాము అని నిర్వాహకులు తెలిపారు.
Also Read : Top Headlines @5PM : టాప్ న్యూస్