NTV Telugu Site icon

Gangs of Godavari: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌.. గోదావరి రొమాంటిక్ నీటిలో తడిచిపోండి

Gangs

Gangs

విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి విశ్వక్‌సేన్‌ కు జంటగా నటిస్తోంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , శ్రీకర స్టూడియోస్‌ , ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Bedurulanka 2012 : నేను అలా అనలేదు.. త‌ప్పుడు ప్ర‌చారాలు చెయ్యొద్దు: కార్తికేయ స్ట్రాంగ్ వార్నింగ్

ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్ ఇప్పటికే విడుదల చేసింది చిత్రయూనిట్ . ఇవి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఇచ్చారు. ‘గోదావరి రొమాంటిక్ నీటిలో తడిసి ముద్దయే సమయమిది’ అనే క్యాప్షన్ ఇచ్చి దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ‘సుట్టంలా సూసి’ అనే ఫ‌స్ట్ సింగిల్‌ రొమాంటిక్ సాంగ్‌ను ఆగ‌ష్టు 16న విడుదల చేయనున్న‌ట్లు ఆ పోస్ట్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Show comments