Site icon NTV Telugu

Panchayat Elections: ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం.. ఆ జిల్లాల్లో వైన్స్ బంద్!

Telangana Panchayat Elections

Telangana Panchayat Elections

Panchayat Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతరులు ఉన్నారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని గ్రామ పంచాయితీల్లో నిన్న (మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ చేయనున్నారు. మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

READ MORE: Pawan Kalyan : పవన్ కల్యాణ్ నిజ స్వభావం బయటపెట్టిన జయసుధ..!

Exit mobile version