NTV Telugu Site icon

First Night: ఫస్ట్‌నైట్ స్వర్గం చూపించిన పెళ్లికూతురు.. నిద్రలేచి చూసేసరికి..

Bride

Bride

First Night: ఓ వ్యక్తి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. చదువుకున్న యువతి అయితే పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుందని భావించి స్నేహితుల సలహా మేరకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికూతురు ఆమె భర్త ఇంటికి వెళ్లి భర్తతో పాటు అతని కుటుంబసభ్యులకు స్వయంగా హల్వా చేసి పెట్టింది. వారు తమ కోడలిని చూసి ఎంతో మురిసిపోయారు. అదే రోజు రాత్రి శోభనం గదిలోకి వెళ్లిన ఆమె భర్తకు స్వర్గం చూపించింది. అంతే మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసిన కొత్త పెళ్లి కొడుకు బిత్తరపోయారు. కొత్త పెళ్లికూతురు సినిమా చూపించిందని తెలిసి షాక్ అయ్యారు. అతనితో పాటు అతని కుటుంబసభ్యులు కూడా షాక్‌కు గురయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా చికేతా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, నీరజ్ కుమార్ వ్యవసాయం చేస్తున్నాడు. నీరజ్ కుమార్‌కు డబ్బు, ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి. చదువుకున్న అందమైన మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నీరజ్ కుమార్ అతని స్నేహితులకు చెబుతూ వస్తున్నాడు. ఆ సందర్భంలో హరిద్వార్‌లో నివసించే నీరజ్ కుమార్ స్నేహితులు సంజయ్, అమిత్‌లకు అక్కడ నివసించే ఒక అమ్మాయి మాకు తెలుసు అంటూ ఆ అమ్మాయి చాలా మంచిదని ఆమెను పెళ్లి చేసుకోమని అతనికి సలహా ఇచ్చారు. నీరజ్ కుమార్ అతని స్నేహితుల మాటలు విని హరిద్వార్ లో నివాసం ఉంటున్న రేఖా అనే మహిళను చూసేందుకు అతని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడ రేఖా కుటుంబ సభ్యులు, నీరజ్ కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లి చర్చలు జరిపారు. పెళ్లి చర్చలు ఫలించడంతో హరిద్వార్ లోనే జనవరి 24వతేదీన నీరజ్ కుమార్, రేఖల పెళ్లి ఘనంగా జరిగింది. హరిద్వార్‌లో రేఖాను వివాహం చేసుకున్న వరుడు నీరజ్ కుమార్ పెళ్లి సక్రమంగా జరిపించిన అతని స్నేహితులు అమిత్, సంజయ్‌లకు లక్ష రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. పెళ్లి తరువాత నీరజ్ కుమార్ నవవధువు రేఖాతో కలిసి అతని స్వగ్రామానికి చేరుకున్నాడు. జంట చూడముచ్చటగా ఉందని గ్రామస్తులు అందరూ నీరజ్ కుమార్ కుటుంబ సభ్యులకు చెప్పారు.

Read Also: Heeramandi: వ్యభిచారులుగా మారిన స్టార్ హీరోయిన్లు.. ఏ రేంజ్ లో చూపిస్తారు

నూతన వధూవరులకు శోభనం ఏర్పాట్లు చేశారు. వరుడు నీరజ్ కుమార్ కుటుంబానికి వధువు రేఖా ఆమె చేతులతో స్వయంగా ఆ రోజు హల్వా తయారు చేసింది. ఆ హల్వాలో పెళ్లికూతురు రేఖా ముందుగానే మత్తు మందు కలిపి భర్త నీరజ్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు అందరికీ ఇచ్చింది. అదే రోజు ఫస్ట్ నైట్ కావడంతో రేఖా ఆమె భర్త నీరజ్ కుమార్‌కు కొంతసేపు స్వర్గం చూపించింది. అనంతరం మత్తు మందు తిన్న కొత్త పెళ్లికొడుకు నీరజ్ కుమార్ గురకపెట్టి నిద్రపోయాడు. నీరజ్ కుమార్ శోభనం రోజు అతని కుటుంబ సభ్యులు కూడా హల్వా తిని అపస్మారకస్థితితో మరుసటి రోజు ఉదయం చాలాసేపు వరకు నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం వధువు రేఖా కనపడకపోవడంతో నీరజ్ కుమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు. రేఖాతో పాటు ఇంటిలో ఉన్న నగలు, డబ్బు మాయం కావడంతో నీరజ్ కుటుంబ సభ్యులు బిత్తరపోవాల్సి వచ్చింది.

అపస్మారక స్థితిలో నుంచి తేరుకున్న వరుడు నీరజ్ కుమార్ కుటుంబీకులు రేఖా అసలు విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ఇరుగుపొరుగున వెతికినా రేఖా ఆచూకీ చిక్కలేదు. పోలీసులకు సమాచారం ఇస్తే పరువు పోతుందని అనుకున్న నీరజ్ కుమార్ వెంటనే హరిద్వార్‌లోని రేఖా ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే రేఖా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలుసుకుని హడలిపోయారు. అప్పటి నుంచి రేఖా కోసం నీరజ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు గాలిస్తున్నారు. రేఖా పెళ్లి అంతా డబ్బుల డ్రామా అని తేలిపోయింది,. ఈ సంఘటన జరిగిన 22 రోజుల తరువాత నీరజ్ కుమార్ మమ్మల్ని మోసం చేసిన రేఖాతో పాటు ఆమె ముఠాను పట్టుకుని శిక్షించాలని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. నీరజ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అమిత్, సంజయ్, రేఖాలపై కేసు నమోదు చేసి వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Show comments