Site icon NTV Telugu

Abu Dhabi: అబుదాబిలో తొలి హిందూ దేవాలయం.. ఎప్పుడు ప్రారంభమంటే..!

Abu Dhabi

Abu Dhabi

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తొలి హిందూ దేవాలయం నిర్మితమైంది. బుధవారం ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం యూఏఈకి వెళ్తున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు జ్ఞాపకంగా బహుమతులు అందజేయనున్నారు.

అలాగే అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. UAEలో కనీసం 3.5 మిలియన్ల మంది భారతీయులు గల్ఫ్‌లోని భారతీయ శ్రామికశక్తిలో భాగమయ్యారు. ఆలయ ముఖభాగంలో రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన 25,000 మంది నైపుణ్యం కలిగిన కళాకారులచే రూపుదిద్దుకుంది. ఆలయం కోసం ఉత్తర రాజస్థాన్ నుంచి అబుదాబికి గణనీయమైన సంఖ్యలో గులాబీ ఇసుకరాయి రవాణా చేయబడింది. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాతిని ఇంటీరియర్స్ నిర్మించారు.

 

Exit mobile version