Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం

Peddireddy

Peddireddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రూ.4.30 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం చేపట్టామన్నారు. స్థలాభావం ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా సబ్ స్టేషన్లతో మేలుకలుగుతుందన్నారు మంత్రి. త్వరలో అన్నవరం దేవస్థానం వద్ద రెండో కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మాణం నిర్మిస్తామన్నారు. సబ్ స్టేషన్లతో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు.

Read ALso: Hanuman idol: సాహిబ్‌గంజ్‌లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కు ప్రాధాన్యం ఉంటుందని, స్మార్ట్ మీటర్ల పై టీడీపీ, కమ్యూనిస్ట్ లు రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్ది రెడ్డి మండిపడ్డారు. రైతులపై ఎటువంటి భారం లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. డిబిటి విధానంలో రైతుల ఖాతాలకే బిల్లులు జమ అవుతాయన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది. అర్థం చేసుకుంటున్న రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు అని మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 33కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..3నెలల అతి తక్కువ సమయంలోనే కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మించాం అన్నారు.

Read Also: Hanuman idol: సాహిబ్‌గంజ్‌లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Exit mobile version