NTV Telugu Site icon

Bidar: ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షలతో జంప్

Bidar

Bidar

డబ్బుల కోసం ఎంతటిదానికైనా తెగిస్తున్నారు దొంగలు.. ఇంతకుముందు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏటీఎం సెంటర్లను టార్గెట్ గా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు. గతంలో చాలా ఘటనలు చూశాం.. ఏటీఎంలలో సీసీ కెమెరాలు తీసేసి, ఏటీఎంలో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా.. ఏటీఎం బాక్సులకు బాక్సులు దొంగలించిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా.. బీదర్ లో పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డారు దుండుగులు. వివరాల్లోకి వెళ్తే…….

Read Also: Kaushik Reddy: ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తాం

కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు. బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టెతో దొంగలు పరారయ్యారు. అందులో రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను వెతికే పనిలో పడ్డారు.

Read Also: Manchu Family : నేను గొడవలు చేయడానికి రాలేదు : మంచు మనోజ్