NTV Telugu Site icon

Vizag: విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్..

Vizag

Vizag

విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్లో మొదలైన మంటలు.. ఇతర బ్లాకుల్లోకి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లకు ఇబ్బంది తలెత్తకుండా ఆస్పత్రి సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: Kolkata doctor murder case: “కంటికి గాయాలు, మెడ ఎముక ఫ్రాక్చర్”.. వైద్యురాలి హత్యాచార ఘటనలో వణికించే నిజాలు..

అగ్ని ప్రమాద ఘటనపై నగర కమీషనర్ ఎస్. బాగ్జీ మాట్లాడుతూ.. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అన్నారు. ఆసుపత్రుల్లో తరుచు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరం అని తెలిపారు. హెఆర్ డిపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని.. ప్రమాదం జరిగిన వెంటనే రోగులకు ఏమీ జరగకుండా వేరే వార్డులకు షిప్ట్ చేసారని అన్నారు. అనేక మంది ప్రాణాలు రక్షించుకోవాడానికి ఆసుపత్రులకు వస్తారు.. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలని కమీషనర్ హెచ్చరించారు. ఇప్పటికైన మిగిలిన ఆసుపత్రులు సెఫ్టీ ఆడిట్ చేసుకుని అంతా సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలని సూచించారు.

Read Also: Team India Players: భారత ఆటగాళ్లకు నెలకు పైగా సెలవులు!

ఫైర్ సేఫ్టీ అధికారి రేణుకయ్య మాట్లాడుతూ.. మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసామని తెలిపారు. స్కై లిఫ్ట్ ద్వారా నేరుగా ప్రమాదం జరిగిన అంతస్తులోనే వాటర్ స్ప్రే చేసామని చెప్పారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.. ఆసుపత్రిలో పెషేంట్లకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ పూర్తి చేసామని ఆయన తెలిపారు.

Show comments