Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీప్రాంతంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గ్రామ శివారు నీలగిరి చెట్ల ప్లాంటేషన్‌లో మంటలు చెలరేగి వేలాది మొక్కలు అగ్నికి అహుతి అవుతున్నాయి. దాహనంలా వ్యాప్తి చెందుతూ పొగలు కమ్ముకున్నాయి. కాళేశ్వరానికి వచ్చే భక్తులు వంటలు వండుకొని మంటలు ఆర్పివేయకుండా వెళ్లడంతో అడవీలో ప్రమాదవశాత్తు నిప్పు రాజుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. జిల్లాలో నిత్యం ఏక్కడో చోట ఫారెస్ట్ తగలబడుతున్న ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫారెస్ట్ తగలబడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెబుతున్నారు.
Read Also: CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో నేడు రేవంత్ రెడ్డి పర్యటన