NTV Telugu Site icon

Fire In Udyan Express: ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. కాసేపు ఆగి ఉంటే..?

Fire In Udyan Express At Bengaluru Ksr Railway Station

Fire In Udyan Express At Bengaluru Ksr Railway Station

Fire In Udyan Express: బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్‌ఆర్‌) రైల్వే స్టేషన్‌లో ఈ ఉదయం ఉద్యాన ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించాయి. ఈ రైలు ముంబై నుండి బెంగళూరు స్టేషన్ మధ్య నడుస్తుంది.. కెఎస్‌ఆర్‌ రైల్వే స్టేషనే చివరి స్టాప్. ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత అగ్నిప్రమాదం జరిగిందని సౌత్ వెస్ట్రన్ రైల్వే తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది, నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read Also:Tax on Gifted Stocks: మీ బంధువులకు షేర్లను గిఫ్ట్ గా ఇస్తున్నారా.. పన్ను మోతమోగిపోద్ది

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి బయలుదేరిన రైలు నంబర్ 11301 ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ శనివారం (ఆగస్టు 19) ఉదయం 5.45 గంటలకు బెంగళూరులోని కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి 7.10 గంటల ప్రాంతంలో రైలులోని బి-1, బి-2 కోచ్‌ల నుంచి పొగలు రావడం కనిపించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Read Also:Richest MPs: ధనవంత ఎంపీలు తెలుగువారే.. 225 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తులు రూ.18,210 కోట్లు

Show comments