NTV Telugu Site icon

Navi Mumbai: నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్యాక్టరీల్లో మంటలు

Mumbai Fire

Mumbai Fire

మహారాష్ట్రలోని నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు ఫ్యాక్టరీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తోంది. మంటలు ఎగిసిపడడంతో పొగలు కమ్ముకుంటున్నాయి.

నవీ ముంబైలోని పావ్నే ఎంఐడీసీకి చెందిన గామి ఇండస్ట్రియల్ పార్క్ వెనుక ఉన్న రెండు కంపెనీల్లో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిప్రమాక దళానికి ఫోన్ చేసి తెలియజేయడంతో ఫైరింజన్లు సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? లేదా? అన్న విషయం ఇంకా తెలియలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

పూణెలోనూ అగ్నిప్రమాదం..
అలాగే పూణె నగరంలోని గేట్ నంబర్ 10 సమీపంలోని మార్కెట్ యార్డ్‌లోని ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు.