NTV Telugu Site icon

Kanpur : కాన్ఫూర్ లో అగ్ని ప్రమాదం.. 500 బట్టల దుకాణాల్లో మంటలు

Fire Accident

Fire Accident

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్ఫూర్ లోని బాస్మండి ప్రాంతంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 500 బట్టల దుకాణాల్లో అగ్ని ప్రమాదం నెలకొంది. ఎఆర్ టవర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న కాంప్లెక్స్ లకు వ్యాపించాయి. మసూద్ టవర్-1, మసుద్ టవర్-2, హమ్రాజ్ కాంప్లెక్స్ లకు మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

Also Read : BRS MLC: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్‌కుమార్‌, చల్లా

మంటలను అదుపు చేసేందుకు సుమారు 25 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. పండుగల సమయంలో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బట్టలు ఈ ప్రమాదంలో దగ్దమయ్యాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో వందలాది దుకాణాలు దగ్ధమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. లతుష్ రోడ్, మీర్పూర్, ఫజల్‌గంజ్ మరియు జజ్మౌ వంటి అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

Also Read : Corona Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజులోనే?

లక్నో నుంచి హైడ్రోల్ ఫైర్ బ్రిగేడ్ యంత్రాలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు అంతస్తుల AR టవర్ బన్స్‌మండిలోని హమ్‌రాజ్ కాంప్లెక్స్ పక్కన ఉంది. వందల కొద్దీ రెడీమేడ్ బట్టల దుకాణాలు ఉన్నాయి. హమ్‌రాజ్‌ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులోని షాపులో మంటలు చెలరేగగా.. మంటలు క్రమంగా ఎగసిపడి పై అంతస్తులో ఉన్న దుకాణాలకు చేరాయి.

Also Read : Allu Arjun: ఇంతకీ అప్డేట్ ఏంటి పుష్ప?

సమాచారం అందిన వెంటనే చీఫ్ ఫైర్ ఆఫీసర్ దీపక్ శర్మతో పాటు లతుష్ రోడ్ ఫైర్ ఆఫీసర్ కైలాష్ చంద్ర, ఫజల్ గంజ్ ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్ పాండే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు కమిషనర్ బిపి జోగ్‌దంద్ కూడా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రధాన అగ్నిమాపక అధికారి దీపక్ శర్మ మాట్లాడుతూ మార్కెట్‌లో షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచ చేస్తున్నారు.