NTV Telugu Site icon

Fire Accident: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి

Fire (1)

Fire (1)

Fire Accident In Hospital: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో మొత్తం ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒక రోగి మృతి చెందాడు. మంటలు చెలరేగినప్పుడు చాలా మంది రోగులు సీల్దా ప్రాంతంలో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఆసుపత్రిలో ఉన్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 అగ్నిమాపక వాహనాలు ఆసుపత్రికి చేరుకొని, ఘటనా స్థలం నుంచి 80 మందిని రక్షించారు.

Read Also: PAK vs ENG: అదరగొట్టిన పాకిస్తాన్ స్పిన్నర్లు.. ఇద్దరే 20 వికెట్స్ పడగొట్టారు!

ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న వార్డులో ఉదయం 5:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ సమయంలో వార్డు మొత్తం పొగతో నిండిపోయి, కిటికీల నుంచి కేకలు వినిపించాయి. ఈ సమయంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరిన ఓ రోగి ఊపిరాడక మృతి చెందాడు. అయితే. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. మంటలు ఆస్పత్రిలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించకముందే అదుపులోకి తీసుకొచ్చారు. కాకపోతే ఇంకా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Read Also: Sadhguru Jaggi Vasudev: సద్గురుకు ఉపశమనం.. అక్రమ నిర్బంధం కేసులో విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

Show comments