హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనలోని ఝాన్సీ బజార్‌లో ఉన్న ఓ హోల్ సేల్ క్లాత్ షోరూంలో మంటలు ఎగసిపడ్డాయి. ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కాగా.. అగ్ని ప్రమాదంపై స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించారు. దీంతో.. వెంటనే 4 ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ముందుగా భవనంపై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని అధికారులు రెస్క్యూ చేసి కాపాడారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా అధికారులు కట్టడి చేశారు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Uttam Kumar Reddy: కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష..
కింది ఫ్లోర్లకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది కంట్రోల్ చేశారు. కాగా.. మంటలు చెలరేగిన 5వ అంతస్తులో డెకరేషన్ మెటీరియల్ ఉండటంతో మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెలరేగాయి. దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కి కొద్దిసేపు ఆటంకం కలిగింది. మంటలు, పొగను అదుపులోకి తీసుకొచ్చారు. మొదట మంటలు వ్యాపించగానే కింది ఫ్లోర్‌కి వర్కర్లు పరుగులు పెట్టారు. సకాలంలో ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
