Fire Accident in Eluru Railway Station: వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత.. వరుగా మరికొన్ని చోట్లు చిన్నపాటి ప్రమాదాలు జరగగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే టెక్నికల్ వ్యాగన్‌లో మంటలు చెలరేగాయి. వ్యాగన్‌లో ఆయిల్ టిన్నులు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో బోగీ మొత్తం దగ్ధమైంది. అయితే వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్టేషన్‌లోవున్న ప్రయాణీకులు భయాందోళనలకు గురై పరుగుల తీసినట్టుగా తెలుస్తోంది..
మరోవైపు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వేస్టేషన్‌లోని సిగ్నలింగ్ కేబుల్ వ్యవస్థకు పెనుప్రమాదం తప్పింది. రైల్వేస్టేషన్ సమీపంలోని చిట్టడవిలో మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో… సకాలంలో స్పందించి ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేశారు. సిగ్నలింగ్ కేబుల్ వ్యవస్థకు మంటలు అంటుకుని ఉంటే పెను ప్రమాదం జరిగేది. ఇక, ఏలూరు రైల్వేస్టేషన్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలను లైవ్‌లో చూసేందుకు కింది లింక్‌ను క్లిక్ చేయండి..