Site icon NTV Telugu

Fire Accident : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఉన్న కారులో మంటలు

Fire

Fire

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని సి4 పార్కింగ్‌లో గల కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే.. మంటలను గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సూరజీ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఢిల్లీ నుండి వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కుటుంబ సభ్యులను ఎక్కించుకునేందుకు తన స్విఫ్ట్ కారు నెంబర్ AP10BF-8925 కారులో ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
Also Read : Women Commission : ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకోండి.. టీఆర్‌ఎస్ మహిళా నాయకులు
అయితే.. తాను వచ్చిన కారును ఎయిర్ పోర్ట్ లోని సి4 పార్కింగ్ వద్ద పార్క్ చేసి కుటుంబ సభ్యులు కారు వద్దకు వచ్చి స్టార్ట్ చేస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సూరజీ కారులో నుండి దిగిపోయాడు. గమనించిన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నా ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సూరజీ కారుతో పాటు పక్కనే ఉన్న మరో మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎమీ కాకపోయినా పెను ప్రమాదం అయితే తప్పింది.

Exit mobile version