Site icon NTV Telugu

Fire Accident : బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం

Fire Up

Fire Up

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లైఫ్ స్టైల్ బిల్డింగ్ మొదటి అంతస్తులో గల ఆరోరా బ్యాంకెట్స్ హోటల్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఉన్న ఆయిల్ కు మంటలు అంటుకొని చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది మరియు కస్టమర్స్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ లోని అన్ని దుకాణాలలో ఫైర్ సేఫ్టీ అల్లారం మోగడంతో భయాందోళనలకు గురి అయిన దుకాణదారులు అన్ని షెటర్స్ మూసివేసి బయటకు పరుగులు తీశారు. కాగా అగ్ని ప్రమాదంలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ దారుణ సంఘటన జనవరి 18వ తేదీ గురువారం రాత్రి ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్రమంలో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భవనంలో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనం అయ్యారు.స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని ప్రమాద సిబ్బంది ఫైరిజన్లతో మంటలను అర్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన షాట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version