Site icon NTV Telugu

Actor Divya Suresh: హిట్ అండ్ రన్ కేసు.. బిగ్‌బాస్ బ్యూటీపై కేసు

Actor Divya Suresh

Actor Divya Suresh

Actor Divya Suresh: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బిగ్ బాస్‌ బ్యూటీపై కేసు నమోదైంది.. కన్నడ బిగ్ బాస్ ద్వారా కర్ణాటకలో బాగా ఫేమస్‌ అయిన నటి దివ్య సురేష్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు.. బెంగుళూరులో యాక్సిడెంట్‌ చేసి పరారైన దివ్య సురేషపై హిట్ అండ్ రన్‌ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు.. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.. ఓ బైక్‎ను ఢీకొట్టిన కారు.. ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్‎పై వెళ్తున్న మహిళ తీవ్రగాయాలపాలయ్యారు.. ఆ బైక్‌పై ఉన్న అనూష, కిరణ్‌కు స్వల్పగాయాలు అయ్యాయి..

Read Also: Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…

అయితే, కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కారు నంబర్‌ను కనుగొని ఆ కారు నటి దివ్య సురేష్‎దిగా గుర్తించారు.. దీంతో, దివ్య సురేష్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.. అంతేకాదు, ఆమె కారును కూడా పోలీసులు సీజ్‌ చేయడం.. మళ్లీ ఆమె తన కారును విడిపించుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటన సోషల్ మీడియాలో వేదికగా విమర్శలు వస్తున్నాయి.. నటి ది్య సురేష్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు.. అయితే, ఈ కేసులో దివ్య సురేష్‌ను బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు..

Exit mobile version