FIR against Kannada Hero Rakshit Shetty: కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన రెండు పాటలు కాపీ కొట్టారని ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలిమాతు, న్యాయ ఎల్లిదే అనే పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ బ్యాచిలర్ పార్టీ సినిమాలో కాపీ కొట్టారని యశ్వంతపుర పోలీస్ స్టేషన్‌లో ఎంఆర్‌టి మ్యూజిక్‌లో భాగస్వామి అయిన నవీన్ కుమార్ చేత పేర్కొన్నారు. తమ పర్మిషన్ తీసుకోలేదని చెప్పారు.
నవీన్ కుమార్ చేత ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న యశ్వంతపుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై స్పందించాలని కోరుతూ హీరో రక్షిత్ శెట్టికి నోటీసులు జారీ చేశారు. ‘జూన్ 24న రక్షిత్ శెట్టిపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేశాం. ఫిర్యాదు దారుడు మాకు కొన్ని పత్రాలు ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి ఆదివారం రక్షిత్ శెట్టికి నోటీసు కూడా పంపించాం. షూటింగ్ కోసం రాష్ట్రం బయటకు వెళ్లిన అతడు తిరిగి వచ్చిన స్టేట్‌మెంట్‌ను తీసుకుంటాం’ అని ఒక సీనియర్ పోలీసు అధికారి సోమవారం మీడియాతో తెలిపారు.
Also Read: Shocking Viral Video: భారీ గేటు ఎక్కి పారిపోయిన 92 ఏళ్ల బామ్మ.. షాకింగ్ వీడియో!
ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ సినిమాలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ నటించారు. ఈ మూవీకి అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించగా.. రక్షిత్ శెట్టి తన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై నిర్మించారు. పాటలకు సంబంధించిన హక్కుల విషయమై గతంలో ఎంఆర్‌టీ స్టూడియోస్, రక్షిత్ శెట్టి సమావేశమైనప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేదట. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బి చిత్రాలతో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.