Mother Dead Body: ఇటలీలో డబ్బు కోసం తల్లీకొడుకుల మధ్య ఇబ్బందికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన తల్లి చనిపోయిన తర్వాత పింఛను పొందడం ఆగిపోకూడదని ఆమె అంత్యక్రియలు చేయలేదు. ఈ వ్యక్తి తన తల్లి మృతదేహంతో ఆరేళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు. ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తర్వాత హాయిగా తల్లి పింఛను డబ్బులు తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు.
Read Also:KTR: నేడు దండు మల్కాపురానికి కేటీఆర్.. టాయ్స్ పార్కు శంకుస్థాపన
ఇటలీలోని తన నివాసంలో తన 86 ఏళ్ల తల్లి మృతదేహంతో నివసించినందుకు 60 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి పింఛన్ డబ్బులు రాబట్టేందుకే ఇలా చేశానని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇటలీకి చెందిన 86 ఏళ్ల హెల్గా మారియా హెంగ్‌బర్త్ తన ఆరోగ్య బీమా కార్డును సంవత్సరాలుగా తీసుకోలేదు. దీని తర్వాత పెన్షన్ విభాగానికి సంబంధించిన అధికారులు హెల్గా మారియా హెంగ్‌బర్త్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఆమెను కలువలేకపోయారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మే 25 న ఉత్తర ఇటలీలోని వెరోనాలోని అతని అపార్ట్మెంట్ కు చేరుకున్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు అతని ఇంటిలోకి వెళ్లారు. ఇక్కడ విచారణలో, అధికారులు హెల్గా సగం కుళ్ళిన మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో ప్యాక్ చేసి, మంచం మీద ఉంచడం గమనించారు. ఆ సమయంలో హెల్గా కుమారుడు లేకపోవడంతో ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత నిందితుడైన కొడుకు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
Read Also:Toll Gate: గేటు తీయడం లేటయిందని.. టోల్ ఉద్యోగిని చంపేశారు
పోలీసుల కథనం ప్రకారం, 60 ఏళ్ల నిందితుడు కొడుకు తన తల్లి జర్మనీలోని తన ఇంటికి తిరిగి వెళ్లిందని తన పొరుగువారితో చెప్పాడని తెలిసింది. అదే సమయంలో నిందితుడు ప్రతి సంవత్సరం దాదాపు 30,000 యూరోలు (దాదాపు రూ. 26.54 లక్షలు) విత్‌డ్రా చేసేవారు. తన తల్లి మృతదేహాన్ని ఉపయోగించి మొత్తం రూ.1.59 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.