Site icon NTV Telugu

Finn Allen: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ లో అమ్ముడుపోని ప్లేయర్.. ఏకంగా క్రిస్ గేల్ రికార్డే బ్రేక్..!

Finn Allen

Finn Allen

Finn Allen: న్యూజిలాండ్ యువ బ్యాటర్ ఫిన్ అలెన్ అద్భుతమైన ప్రదర్శనతో టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2025 మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ మ్యాచ్‌లో అలెన్ పలు రికార్డులు సృష్టించాడు. ఇప్పటికే మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఫిన్ అలెన్ ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోకపోయినప్పటికీ అమెరికాలో జరుగుతున్న MLC టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే తన ప్రతాపాన్ని చూపాడు.

Read Also: Plane Crash: “1206”ను అదృష్ట సంఖ్యగా భావించిన మాజీ సీఎం.. అదే తేదీన మృత్యుఒడికి…

సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరపున వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుపై ఆడిన అలెన్ కేవలం 51 బంతుల్లోనే 151 పరుగులు చేశాడు. 34 బంతుల్లో శతకం పూర్తి చేసిన అతడు, 49 బంతుల్లో 150 పరుగుల మార్క్ చేరుకుని T20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ 5 ఫోర్లు, 19 సిక్సులు బాదాడు. ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (2013లో 18 సిక్సులు), ఎస్టోనియాకు చెందిన సహిల్ చౌహాన్కి (2024లో 18 సిక్సులు) గా ఉండేది. అయితే, అలెన్ ఇప్పుడు వీరిని అధిగమించి 19 సిక్సులతో కొత్త రికార్డు నెలకొల్పాడు.

Read Also: Plane Crash: విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా ఎందుకు పాల్గొంటోంది?

ఇక తుపాను ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడిన ఫిన్ అలెన్.. MLCలో అతి వేగంగా శతకం చేయడం ఉత్సాహాన్ని ఇచ్చింది. బౌండరీలు సులభంగా లభించాయి. భాగస్వామ్యాలు బాగున్నాయి, మంచి స్కోరుకు ప్రయతించాము.. గ్రౌండ్ పరిమాణం కూడా అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఇకపోతే, ఐపీఎల్ 2025 వేలంలో రూ. 2 కోట్ల ప్రాథమిక ధరకు ఉన్నపటికీ ఎవ్వరూ బిడ్ వేయలేదు. నవంబర్ 2024లో జరిగిన ఈ వేలంలో అలెన్ మాత్రం అప్పట్లో ఆసక్తి లేని ఆటగాడిగా పరిగణించబడ్డాడు. కానీ ఇప్పుడు MLCలో తన ఫామ్ చూపడంతో, ఐపీఎల్ యాజమాన్యాలతో సహా వివిధ టోర్నీలలో ఉండే జట్ల యాజమాన్యాల ద్రుష్టి పడడం ఖాయం.

Exit mobile version