America Crisis: గతేడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. దాదాపు అదే పరిస్థితి ఇటీవల పొరుగున ఉన్న పాకిస్తాన్ లో కూడా తలెత్తింది. దీంతో తినడానికి కూడా తిండి దొరకక జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజల్లో ఇప్పటివరకు అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చేటట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్థికమాంద్యంతో దేశం కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో అమెరికా సతమతమవుతోంది. ఈ క్రమంలోనే దేశ ఖజానా ఖాళీ అయి అప్పుల కోసం అర్రలు చాచి ఎదురు చూస్తోంది. అప్పుల పరిమితిని పెంచడానికి పార్లమెంటు ఆమోద ముద్ర వేయకపోవడంతో అమెరికా ప్రభుత్వం డబ్బుల కోసం కటకటలాడుతోంది. డబ్బుల్లేక ఏకంగా అధ్యక్షుడు బైడెన్ కీలక ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Read Also:Varun Tej: గన్స్, బైక్స్, ఛేజ్… మెగా ప్రిన్స్ ఎదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నాడు
ఏ ప్రభుత్వమైనా ఆదాయం కంటే ఖర్చులు పెరిగినప్పుడు అప్పు కోసం ప్రయత్నిస్తాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా అదే చేస్తోంది. ఏ దేశానికైనా ఇబ్బడిముబ్బడిగా అప్పు తీసుకోలేదు. అందుకు నియంత్రణ ఉంటుంది. వందేళ్ల కిందటే అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పులను కాంగ్రెస్ నియంత్రించింది. అవసరాల రీత్యా ఈ పరిమితిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు. 1917 నుంచి ఇప్పటిదాకా 78 సార్లు అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితిని సవరించారు. ఈ సారి అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య రాజకీయ వైరం పెరిగింది. సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈసారి అప్పు తీసుకోలేక ఆర్థిక మంత్రే చేతులెత్తేశారు. 2021 నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 ట్రిలియన్ డాలర్లు. దేశ జీడీపీ కంటే ఇది 24శాతం ఎక్కువ. ఇందులో సుమారు 7 ట్రిలియన్ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. మిగతాది సంస్థలు, వ్యక్తుల నుంచి తీసుకుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్ డాలర్లు. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరుతోంది. కానీ రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంపునకు ససేమిరా అంటున్నారు.
Read Also:Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఏకైక డిప్యూటీ సీఎంగా డీకేఎస్.. పార్టీ అధికారిక ప్రకటన
అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ అప్పు పరిమితి పెరగకపోతే జూన్ ఒకటి తర్వాత ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని ప్రకటించారు. ప్రస్తుతం అప్పులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఖజానాకు పన్నుల ద్వారా వచ్చే సొమ్మునే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు, వడ్డీలు, బిల్లులు తీర్చలేని పరిస్థితి వస్తుందో అది సాంకేతికంగా దివాలా తీసినట్లుగా భావిస్తారు. అమెరికా చరిత్రలో ప్రభుత్వం చెల్లింపులు జరపలేని పరిస్థితి రాలేదు. అదే జరిగితే అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్రమైన ఆర్థిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సైన్యం జీతాలు నిలిచిపోతాయి. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా రుణాలు, క్రెడిట్ కార్డులపై అధికంగా చెల్లించాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. భారీ నిరుద్యోగంతో తలెత్తుతుంది. అది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. అమెరికా బిల్లులు చెల్లించలేని పరిస్థితి తలెత్తితే 80 లక్షల ఉద్యోగాలు పోతాయి. స్టాక్ మార్కెట్ 45శాతం కుప్పకూలుతుంది. రుణ పరిమితిని కాంగ్రెస్ పెంచకుంటే.. అమెరికా మాంద్యాన్ని చవిచూస్తుంది. ఆ దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి.