మెగా ఫ్యామిలీ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కాస్త ట్రెండ్ మార్చి కొత్త రకం సినిమాలు చేసే హీరో వరుణ్ తేజ్. రిజల్ట్ తో సంబంధం లేకుండా అంతరిక్షం, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు చెయ్యడం వరుణ్ తేజ్ నైజం. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీ ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ తన ఫిల్మోగ్రఫీలో మంచి వేరియేషన్స్ చూపిస్తున్న వరుణ్ తేజ్, రీసెంట్ గా ‘గని’ సినిమాతో మెగా ఫాన్స్ ని డిజపాయింట్ చేసాడు. బాక్సింగ్ నేపధ్యంలో రూపొందిన ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ బాగానే కష్టపడ్డాడు కానీ ఫలితం దక్కలేదు. దీంతో మెగా ప్రిన్స్ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ‘VT 12’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మేకర్స్ ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు. టైటిల్ మెగా ఫాన్స్ నే కాకుండా రెగ్యులర్ మూవీ లవర్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది.
ఏజెంట్ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ‘సాక్షి’ గాండీవధారి అర్జున సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ముఖేష్ కెమెరా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఆర్ట్ విభాగాన్ని అవినాష్ కొల్లా చూసుకుంటారు. ప్రస్తుతం ఈ స్పై యాక్షన్ మూవీ ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. “బడాపెస్ట్ లో ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్నాం. కొన్ని కీ సీన్స్ ని ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నాం” అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా సెట్స్ నుంచి కొన్ని ఫొటోస్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. వీటిలో గన్స్, బైక్స్, ఛేజ్ లకి సంబందించిన ఫోటోలు ఉన్నాయి. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న గాండీవధారి అర్జున సినిమాతో అయినా వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. వరుణ్ తేజ్ కి మాత్రమే కాదు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నాగార్జునతో ప్రవీణ్ సత్తారు చేసిన యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’ హెవీ లాస్ ని ఫేస్ చేసింది. సో ప్రవీణ్ సత్తారుని హీరోలు, ప్రొడ్యూసర్ లు మళ్లీ నమ్మాలి అంటే అతను గాండీవధారి అర్జున సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల్సిందే.
From the sets of #GandeevadhariArjuna ❤️🔥
The action-packed final schedule is currently underway in Budapest, Hungary with some key scenes being shot on MEGA PRINCE @IAmVarunTej 💥
More updates blasting soon 🔥@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/fBkZQS8eyv
— SVCC (@SVCCofficial) May 18, 2023