NTV Telugu Site icon

Pat Cummins: మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్.. పిచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!

Pat Cummins

Pat Cummins

Pat Cummins: రేపు (ఆదివారం) ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మహా సంగ్రామం జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన పిచ్ పరిస్థితులను ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ పరిశీలించారు.

Read Also: World Cup 2023: భారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తా.. సీఈఓ సంచలనం

పిచ్ పరిశీలన అనంతరం ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బాగానే ఉందని.. ఇది ఇంతకుముందు ఉపయోగించిన పిచ్ లా కనిపిస్తోందని తెలిపాడు. బహుశా ఈ పిచ్ పై వరల్డ్ కప్ లో ఓ మ్యాచ్ (అక్టోబరు 14న టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్) జరిగి ఉంటుందని భావిస్తున్నానని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Read Also: World Cup Final 2023: టీమిండియా బలాబలాలు ఇవే.. ఆసీస్తో ముప్పు అదే..!

అయితే.. పిచ్ స్వభావం ఎలాంటిదో చెప్పడానికి అంత ఎక్స్ పర్ట్ ని కాదన్నాడు. తనవరకైతే పిచ్ బాగానే ఉన్నట్టు కనిపించిందని తెలిపాడు. తాను పిచ్ పరిశీలనకు వెళ్లినప్పుడు గ్రౌండ్ సిబ్బంది నీళ్లతో తడిపి ఉంచారని, మరో 24 గంటలు గడిచాక మరోసారి పరిశీలిస్తే మరేమైనా చెప్పగలం అని కమిన్స్ చెప్పాడు.