NTV Telugu Site icon

Filmfare Awards 2024: నానికి డబుల్ ధమాకా.. తెలుగు నామినేషన్స్‌ లిస్ట్ ఇదే!

Filmfare Awards 2024

Filmfare Awards 2024

Nani’s Dasara movie Nominated in Best Film: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024లో మొదటి అడుగు పడింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ వేడుకలను ఎక్కడ?, ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. తెలుగు నామినేషన్స్‌ లిస్ట్ ఓసారి చూద్దాం.

నేచురల్‌ స్టార్ నానికి డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఉత్తమ నటుడు కేటగిరిలో నాని రెండు (దసరా, హాయ్‌ నాన్న) సినిమాలకు నామినేట్ అయ్యాడు. ఈ కేటగిరిలో ఆనంద్‌ దేవరకొండ (బేబీ), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య), ధనుష్‌ (సర్‌), నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) పోటీ పడుతున్నారు. ఉత్తమ దర్శకుడు కేటగిరిలో కూడా హాయ్‌ నాన్న, దసరా ఉండడం విశేషం. ఉత్తమ నటి కేటగిరిలో కీర్తి సురేశ్‌ (దసరా) ఉన్నారు. ఉత్తమ చిత్రంకు దసరా నామినేట్ అయింది.

ఉత్తమ చిత్రం:
బేబీ
బలగం
దసరా
హాయ్‌ నాన్న
మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి
సామజవరగమన
సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌

ఉత్తమ నటుడు:
ఆనంద్‌ దేవరకొండ (బేబీ)
బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)
చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)
ధనుష్‌ (సర్‌)
నాని (దసరా)
నాని (హాయ్‌ నాన్న)
నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)
ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)

ఉత్తమ నటి:
అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)
కీర్తిసురేశ్‌ (దసరా)
మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)
సమంత (శాకుంతలం)
వైష్ణవీ చైతన్య (బేబీ)

ఉత్తమ దర్శకుడు:
అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)
కార్తిక్‌ దండు (విరూపాక్ష)
ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
సాయి రాజేశ్‌ (బేబీ)
శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)
శ్రీకాంత్‌ ఓదెల (దసరా)
వేణు యెల్దండ (బలగం)

ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)
దీక్షిత్‌శెట్టి (దసరా)
కోట జయరాం (బలగం)
నరేశ్‌ (సామజవరగమన)
రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)
విష్ణు ఓఐ (కీడా కోలా)

ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)
రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)
రుపా లక్ష్మీ (బలగం)
శ్యామల (విరూపాక్ష)
శ్రీలీల (భగవంత్‌ కేసరి)
శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు)

ఉత్తమ గాయని:
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)
చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)
దీ (చమ్కీల అంగీలేసి -దసరా)
మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)
శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)
శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌)

ఉత్తమ గాయకుడు:
అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)
హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)
పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)
రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)
సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)
శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌:
బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)
బలగం (భీమ్స్‌ సిసిరిలియో)
దసరా (సంతోష్‌ నారాయణ్‌)
హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)

ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)
అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)
కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)
పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)

Also Read: OnePlus Nord 4 Price: ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ 4’ వచ్చేసింది.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌!